కుమురంభీం విగ్రహావిష్కరణకు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

కుమురంభీం విగ్రహావిష్కరణకు తరలిరావాలి

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

ఇంద్రవెల్లి: మండలకేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న కుమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 9 తెగల ఆదివాసీలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద తుడుందెబ్బ, రాయిసెంటర్‌ సార్‌మెడిలతో పాటు ఆయా గ్రామాల పెద్దలతో సమావేశమయ్యారు. ఈ నెల 10న నర్సపూర్‌ రాయిసెంటర్‌ పరిధిలోని గ్రామాల్లో, 11న గిన్నెరా రాయిసెంటర్‌, 12న వడగాం రాయిసెంటర్‌, 13న కేస్లాపూర్‌ రాయిసెంటర్‌ పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. రాయిసెంటర్‌ సార్‌మెడిలు మెస్రం వెంకట్‌రావ్‌, మెస్రం దుర్గు, ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలు మెస్రం నాగ్‌నాథ్‌, ఆర్క ఖమ్ము, కొరెంగా సుంకట్‌రావ్‌, చహకటి నాగోరావ్‌, కినక జుగాదిరావ్‌, మడావి కోసేరావ్‌, సర్పంచ్‌లు కోవ రాజేశ్వర్‌, మడావి ఇంద్రదేవ్‌, కోసేంగా సుంగు, తుడుందెబ్బ నాయకులు జుగ్నాక్‌ భారత్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement