ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలోని రెడ్డి సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నపల్లి లింగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంలోనూ అనేక కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయన్నారు. పేద కుటుంబాల అభ్యున్నతికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న వినోద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటరామ్ రెడ్డిలను సత్కరించి అభినందించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓంప్రకాశ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కిష్టారెడ్డి, నారా యణ రెడ్డి, గోపిడి రాంరెడ్డి, స్వామి రెడ్డి, జలంధర్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, సతీశ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు.


