విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌లో పనిచేసే కార్మికులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడుతామని రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ అన్నారు. రిమ్స్‌ ఆడిటోరియంలో పారిశుద్ధ్య, పేషెంట్‌కేర్‌, సెక్యూరిటీగార్డులు, ఏజెన్సీల నిర్వాహకులతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరికి కేటాయించిన విధులు వారే బాధ్యతతో నిర్వర్తించాలని ఆదేశించారు. ఇతర పనులు చేయవద్దని, సమయపాలన పాటించా లని సూచించారు. ప్రణామ్‌ యాప్‌ ద్వారా అ టెండెన్స్‌ ఉంటుందని ఎవరైనా గైర్హాజరైనట్ల యితే వేతనాల్లో కోత తప్పదన్నారు. రోగుల విషయంలో మర్యాదగా వ్యవహరించాలన్నా రు. పేషెంట్‌ కేర్‌లు రోగులను ఆయా వార్డుల కు స్ట్రెచర్‌పైనే తీసుకెళ్లాలన్నారు.రోగులబంధు వులు తరలించినట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement