తాంసి: త్రీఫేజ్ విద్యుత్ కోతలపై భీంపూర్ మండల రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అర్లి(టి) సబ్‌స్టేషన్‌ను ముట్ట డించారు. రోజుకు 15నుంచి 20 సార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నా రు. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలకు బా వుల నుంచి సాగునీరు ఇద్దామంటే కరెంట్ సరఫరాలో అంతరాయంతో అవస్థలు పడుతున్నామన్నారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అర్లి(టి), అంతర్గాం, గోముత్రి, కరంజి, వడూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.


