ఎట్టకేలకు.. | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

ఒంటికి.. రెంటికి తీరనున్న ఇక్కట్లు

జిల్లాలోని సర్కారు బడులకు 324 టాయిలెట్లు మంజూరు

మరమ్మతుల్లో ఉన్న 170కు నిధుల కేటాయింపు

తీరనున్న విద్యార్థుల ఇబ్బందులు

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, కిచెన్‌ షెడ్లు, ప్రహరీలతో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను చేపడుతోంది. తాజాగా మరుగుదొడ్లు లేని పాఠశాలలకు నూతనంగా మంజూరు చేయగా, మరమ్మతులో ఉన్న వాటికి నిధులు కేటాయించింది. దీంతో ఒంటికి.. రెంటికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటిని సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా చేపట్టనున్నారు. యూడైస్‌ ద్వారా మరుగుదొడ్లు అవసరం ఉన్న బడుల వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు జిల్లా విద్యా శాఖ అధికారులు నివేదికలు సమర్పించారు.

తీరనున్న సమస్యలు..

జిల్లాలో చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని చోట్ల టాయిలెట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బా లురు ఆరుబయటకు వెళ్తుండగా, బాలికలు ఇక్కట్లు వర్ణనాతీతం. చాలా మంది విద్యార్థులు మంచినీరు తాగకుండా అలాగే ఉండడంతో అనా రోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో వృథాగా మారాయి. వీటన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపడుతోంది.

324 మరుగుదొడ్ల మంజూరు..

జిల్లాలోని ఆయా సర్కారుబడులకు ప్రభుత్వం 324 మరుగుదొడ్లను కొత్తగా మంజూరు చేసింది. వీటిలో బాలుర కోసం 171, బాలికల కోసం 153 టాయిలెట్లను నిర్మించనుంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు బాలురకు 162, బాలికలకు 149, ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలుర కోసం 9, బాలి కల కోసం 4 మంజూరు చేశారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 170 మరమ్మతుల్లో ఉన్న మరుగుదొడ్లకు సైతం నిధులు విడుదలయ్యా యి. మొత్తం రూ.90లక్షలు కేటాయించింది. దీంతో నిరుపయోగంలో ఉన్న మరుగుదొడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల సమస్యలు తీరనున్నాయి. అలాగే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్నవారి ఇండ్లలకు వెళ్లాల్సిన దుస్థితి.

జిల్లాలో..

డీఈవో పరిధిలో ప్రభుత్వ

యాజమాన్య పాఠశాలలు 739

ప్రాథమిక 500

ప్రాథమికోన్నత 119

ఉన్నత 120

ఇందులో చదివే విద్యార్థులు 57,896 మంది

జిల్లాకు 324 మంజూరు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 324 మంజూరయ్యాయి. బాలురు, బాలికలకు వే ర్వేరుగా కేటాయించారు. అలాగే వినియోగంలోని లేని 170 మరుగుదొడ్ల మరమ్మతుల కోసం రూ.90లక్షల నిధులు మంజూరయ్యాయి.

– రఘురమణ, సెక్టోరల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement