కై లాస్‌నగర్: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే బియాండ్ ది హోరిజన్..ఏ రైడ్ ఫర్ రెసిలియెన్స్ జాతీయ ప్రచార యాత్ర ప్రధాన ఉద్దేశమని మానసిక ఆరోగ్య ప్రచారకర్త సెహర్ హష్మీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రచారయాత్రపై శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మాట్లాడారు. తాను 2025లో బైక్ ద్వారా తొలి ప్రచార యాత్ర నిర్వహించానని, ప్రస్తు తం రెండో యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపా రు. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు మహిళల సామర్థ్యంపై సమాజంలో ఉన్న మూస ధోరణులు మార్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కా మర్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహ న కల్పించారు. అనంతరం మానసిక ఆరోగ్యంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రచార యాత్ర రైడర్లు పరా స్, అమిత్ త్యాగి, రాజేశ్, కళాశాల ప్రిన్సి పాల్ అతిక్ బేగం, తదితరులు పాల్గొన్నారు.


