కుంటాల: పోస్టల్ అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థి పోటీపరీక్షకు దూరమయ్యాడు. మండలంలోని దౌనెల్లి పంచాయతీ పరిధి దౌనెల్లి తండాకు చెందిన జాదవ్ ప్రవీణ్ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ సివిల్(ఎన్‌ఎండీసీ) ఇంజనీర్ ఉద్యోగం కోసం మహారాష్ట్రలోని పుణెలో ఏడాదిపాటు శిక్షణ పొందాడు. హైదరాబాద్‌లో ఈనెల 1న పరీక్ష ఉండగా, 2న కాల్‌లెటర్ పోస్టల్ సిబ్బంది ఆలస్యంగా అందించడంతో విద్యార్థి పరీక్షకు దూరమయ్యాడు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు జాదవ్ ప్రవీణ్ పేర్కొన్నాడు. ఈవిషయమై కుంటాల ఎస్పీఎం ఆనంద్‌రావును ‘సాక్షి’ఫోన్‌లో వివరణ కోరగా తమ కార్యాలయానికి 2న మధ్యాహ్నం 1 గంటకు కాల్‌లెటర్ వచ్చిందని పేర్కొన్నారు. ఆర్డినరీ పోస్టు వల్ల జాప్యం జరిగి ఉండవచ్చని తెలిపారు.


