బాసర హుండీ ఆదాయం రూ.68.54లక్షలు | - | Sakshi
Sakshi News home page

బాసర హుండీ ఆదాయం రూ.68.54లక్షలు

Oct 4 2026 8:26 AM | Updated on Oct 4 2026 8:26 AM

బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ కానుకల లెక్కింపు శనివారం బాలాలయంలో నిర్వహించారు. 93 రోజులకు గాను హుండీల ద్వారా సమర్పించిన కానుకలను ఆలయ ఈవో అంజనీదేవి, దేవాదాయ శాఖ సహాయ కార్యనిర్వహణాధికారి జి.గంగాశ్రీనివాస్‌ సమక్షంలో లెక్కించారు. రూ.68,54,867 నగదు, 50.100 గ్రాముల మిశ్రమ బంగారం, 1.650కిలోల మిశ్రమ వెండి, వివిధ దేశాల 55 విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు హుండీలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు శివరాజ్‌, సంజీవ్రావు, ఆలయ పరిపాలన, వైదిక సిబ్బంది, యూబీఐ బ్యాంక్‌ ప్రతినిధులు, బాసర పోలీసు సిబ్బంది, వాగ్దేవి సొసైటీ సభ్యులు, సిరిసిల్ల శ్రీశివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement