అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజు నోటీసు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజు నోటీసు

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

కోటపల్లి: మండలంలోని నక్కలపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందకుండా సరుకులు కాజేయడం, కుళ్లిన కోడిగుడ్లు అందించడం, పెళ్లికాని యువతిని గర్భిణిగా, బీటెక్‌ విద్యార్థినిని రెండేళ్ల బాబుగా నమోదు వంటి అవకతవకలు ఇటీవల వెలుగులో వచ్చాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో స్పందించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా సీడీపీవో విష్ణుప్రియ, కోటపల్లి సూపర్‌వైజర్‌ సంధ్యతో కలిసి కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. టీచర్‌ సరోజకి షోకాజు నోటీస్‌ అందజేశారు. రికార్డుల్లో ఉన్న పేర్లను కేంద్రానికి పిలిపించి వివరాలు సేకరించి పూర్తిగా లిఖితపూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. గతంలో సదరు టీచర్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement