మంచిర్యాలక్రైం: ఇంటర్‌నెట్ సెంటర్‌లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు సోమవారం తన చాంబర్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్‌నెట్ సెంటర్‌లో ఈ నెల 25న దొంగతనం జరిగింది. కంప్యూటర్, మానిటర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్‌నెట్ సెంటర్‌లోని సీసీ కెమెరా ఆధారంగా దొంగను బెల్లంపల్లికి చెందిన మహ్మద్ మద్గుంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు యజమానిని శాలువాతో సన్మానించారు.


