బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా పూజలు, హోమాది వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు మురళీశర్మ, దీక్షిత్, వేద పండితులు అంకుశర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, ఈవో అంజనాదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


