బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యావిధానం, క్రమశిక్షణ, పరీక్ష సరళి, క్యాంపస్ వసతులు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియెంటేషన్ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్, ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం, ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు.


