ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఎస్‌ఈ జే.సుభాష్, డీడీఈ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్‌స్టేషన్ వద్ద గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్, విష్ణు, శ్రీకాంత్, టి.మధుసూదన్‌రావు, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీపీ వర్మ, సునీల్, పి.విక్రంపాటిల్, పి.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.


