మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గోమాత సంరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణంలో 60 వేల సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌లకు అందజేస్తామని తెలిపారు. సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంథిని సతీష్, భవానీ, గోరక్షకులు సూరిబాబు, వెంకటేశం, నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


