ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి ప్రాథమిక పాఠశాల గేటు ముందు సోమవారం విద్యార్థులు, వారి తలిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ‘మా సార్లు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ముఖరా బి యూపీఎస్ పాఠశాలలో 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6, 7 తరగతులలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఇతర స్కూళ్ల నుంచి ఇద్దరు ఎస్జీటీ టీచర్లను ఇక్కడి పాఠశాలకు కేటాయించారు. దీంతో వేరే స్కూళ్ల నుంచి వచ్చిన ఎస్జీటీ ఉపాధ్యాయులు వద్దని, తమ సార్లనే తమకే కేటా యించాలని ధర్నా నిర్వహించారు. సర్పంచ్ ఖాతున్‌బీ, మాజీ సర్పంచ్ అడవ్‌మారుతి, విద్యాకమిటీ చైర్మన్ ఇమాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


