ఉద్యమంలో ‘అల్లూరి’ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో ‘అల్లూరి’

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

ఉద్యమంలో ‘అల్లూరి’

నిర్మల్‌: ప్రత్యేక తెలంగాణ కోసం 1998లో మాజీమంత్రి పి.ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. అప్పట్లోనే ఆ పార్టీ బహిరంగసభ నిర్వహించడంలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఉద్యమకారుడు అల్లూరి మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. 2003 డిసెంబర్‌ 21న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌, ప్రము ఖ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, తదితరులతో కలిసి స్థానిక స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో అవగా హన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 2007లో వెయ్యిఉరుల మర్రి స్మారకస్థూపం ఏర్పాటులో చురుకుగా పాల్గొన్నారు. గద్దర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారీ బహిరంగసభను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలమైన సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement