అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

● ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. బుధవారం రాత్రి ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ (కార్డన్‌ అండ్‌ సెర్చ్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు వాహన నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. యువత గంజాయి బారిన పడవద్దని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌ జీవన్‌రెడ్డి, సీఐలు కె.నాగరాజు, రహీంపాషా, కె ఫణిధర్‌, ఎస్సైలు విష్ణువర్ధన్‌, దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

నలుగురు ఎఫ్‌ఆర్వోల బదిలీ

ఆదిలాబాద్‌టౌన్‌: అటవీశాఖలో పనిచేస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్వో)లకు స్థానచలనం జరిగింది. ఆదిలాబాద్‌లో పనిచేస్తున్న గులాబ్‌సింగ్‌ కామారెడ్డిలోని మాచరెడ్డికి బదిలీకాగా అతని స్థానంలో నిర్మల్‌ జిల్లా మామడ నుంచి అవినాష్‌ రాథోడ్‌ బదిలీపై వచ్చారు. ఇంద్రవెల్లి ఎఫ్‌ఆర్‌వో సంతోష్‌ మంచి ర్యాల జిల్లాలోని దేవాపూర్‌కు బదిలీ కాగా, అతని స్థానంలో ఎవరిని కేటాయించలేదు. సిరిచెల్మ పోస్టు ఖాళీగా ఉండగా మంచి ర్యాలలో టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తు న్న కారెం శ్రీనివాస్‌ బదిలీపై వచ్చారు. ఇచ్చోడలో పనిచేస్తున్న పుండలిక్‌ నిజామాబాద్‌ జిల్లా వర్ణికి బదిలీ కాగా, అతని స్థానంలో బాన్సువాడలో పనిచేస్తున్న సంతోష్‌ బదిలీపై వచ్చారు. నేరడిగొండలో పనిచేస్తున్న బి.గణేశ్‌ మెదక్‌కు బదిలీ కాగా, అతని స్థానంలో రాజన్న సిరిసిల్లలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా పనిచేస్తున్న వై.గంగాధర్‌ బదిలీపై వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement