మధుర జ్ఞాపకాలు.. | - | Sakshi
Sakshi News home page

మధుర జ్ఞాపకాలు..

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2011 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమం పరాకాష్టకు చేరిన రోజులు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచాయని నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు సాధు రాంరెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన ఉద్యమ సహచరులతో కలిసి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవాలు జీవితాంతం మరువలేనివని చెప్పారు. బాసరలో చేపట్టిన రైల్‌రోకో నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ ఘటనలు, ఉద్యమంలో ఎదుర్కొన్న సవాళ్లు, సహచరులతో కలిసి సాగించిన పోరాటం తన జీవితంలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులను ఇప్పటికై నా గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement