సాత్నాల: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన భోరజ్ మండలం కామాయిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు గ్రామానికి చెందిన కోల దేవన్న (53) బుధవారం తెల ్లవారుజామున రేకుల పైన ఉన్న చీపురు తీసేందుకు చేతులు పెట్టడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన భార్య గంగుబాయి, కుమారుడు చిన్నయ్య అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరికీ షాక్ తగిలి కిందపడ్డారు. గమనించిన స్థానికుడు నర్సింగ్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన దేవన్నను అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ తెలిపారు. కాగా పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాధను దిగమింగుతూ మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో దేవన్న నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.


