లక్కీడ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

లక్కీడ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

కై లాస్‌నగర్‌: మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా అందించే ఈ బైక్‌ లబ్ధిదారుల ఎంపికకు గాను మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం లక్కీడ్రా నిర్వహించారు. వీటి కోసం పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన 747 మంది మైనార్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 65 రిజెక్ట్‌ అయ్యాయి. 682 దరఖాస్తుల నుంచి 27 మందిని ఎంపిక చేసేందుకు చైర్‌పర్సన్‌ అనూష ఆధ్వర్యంలో లక్కీడ్రా చేపట్టారు. ఎంపికై న వారి వివరాలను కార్యాలయ నోటీసుబోర్డుపై ప్రదర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌, మెప్మా పీడీ సీవీఎన్‌. రాజు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement