కై లాస్‌నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ఈనెల 12 వరకు నిర్వహించే గ్రామ, వార్డుసభలను అధికారులు సమన్వయంతో సాగుతూ విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈమేరకు జిల్లా, మండలస్థాయి అధి కారులతో కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి బుధవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జనగణన, భూభారతి పనులు వేగవంతం చేయాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, విరిగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశాల నమోదు పెంచాలన్నారు.ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు.


