పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

ఆదిలాబాద్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌తో కలిసి డీఎఫ్‌వో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ఇంధన సంక్షోభం నేపథ్యంలో సైకిల్‌ వాడకం అత్యుత్తమమైనదని తెలిపారు. అలాగే జూన్‌ 7న స్టేడియంలో నిర్వహించనున్న 5కే రన్‌లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అంతకుముందు స్టేడియంలో మానవ హారంగా ఏర్పడ్డారు. ఇందులో డీవైఎస్‌వో శ్రీనివాస్‌, ఎఫ్డీవో అరవింద్‌ కుమార్‌, చిన్న భూష రెడ్డి, ఎఫ్‌ఆర్వోలు అవినాష్‌, షీలానంద, అరుణ, కవిత, సవిత, ఎఫ్‌ఎస్‌వోలు, డీఆర్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement