రెండు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీ డిప్యూటేషన్‌పై ‘సూపర్‌వైజర్’ ఇతర విధుల్లో రెగ్యులర్ జవాన్లు బల్దియాలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ
కై లాస్‌నగర్: గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. పట్టణంలోని 49 వార్డులకు ఒకే ఒక్క శానిటరీ ఇన్‌స్పెక్టర్ పనిచేస్తున్నాడు. అలాగే ప లువురు జవాన్లు రెగ్యులర్ విధులు విస్మరించి ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఫలితంగా ఆయా వా ర్డుల్లో చెత్త డంప్‌లు దర్శనమిస్తుండగా డ్రెయినేజీల్లో పూడిక పేరుకుపోయి మురుగునీరంతా రోడ్ల పై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది.
ఐదు పోస్టులకు ఒక్కరే ..
మున్సిపల్‌లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ విభా గంంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. మూడు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మంజూరు ఉండగా కేవలం ఒ క్కరే పనిచేస్తున్నారు. అలాగే సూపర్‌వైజర్‌గా ఇక్క డ పోస్టింగ్‌పొందిన ఓ అధికారిడిప్యూటేషన్‌పై నిజా మాబాద్‌లో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అధికారి మూడు నెలల క్రితం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీగా మారింది. ఈ విభాగంలో ఐదు పోస్టులకు గాను కేవలం ఒక్కరే ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి. పట్టణంలోని పలువార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి.
విధులపైనే ఆసక్తి ..
బల్దియాలో 13 జవాన్ పోస్టులు మంజూరు ఉన్నా యి. ప్రస్తుతం నలుగురే విధులు నిర్వహిస్తున్నారు. మరో ఐదుగురు నిబంధనలకు విరుద్దంగా రెవె న్యూ విభాగంలో కొనసాగుతుండడం గ మనార్హం. వీరు బిల్ కలెక్టర్లుగా, ఆర్‌ఐలకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో వారి స్థానా ల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను జవాన్లుగా ని యమించారు. వీరు వార్డులకు వచ్చామా..వెళ్లామా అనే తరహాలో మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులపై అజాయియిషీ కొరవడివారు సక్రమంగా విధులు నిర్వహించని పరిస్థితి. రానున్న ది వర్షాకాలం కావడంతో ఇదే పరి స్థితి కొనసాగితే జనం వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు.
పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. శానిటరీ సూపర్‌వైజర్ డిప్యూటేషన్ రద్దు చేయించి తిరిగి మున్సిపాలిటీకి రప్పించేలా చర్యలు తీసుకుంటాం. జవాన్లు ఇతర విభాగాల్లో పనిచేస్తున్నట్లుగా దృష్టికి రాలేదు. వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించేలా ఆదేశిస్తాం.
– ఏ.జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్


