అగ్నివీర్‌లుగా ఎంపిక
ఆదిలాబాద్: అగ్నివీర్–వాయుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. సోమవారం రాత్రి విడుదలై న ఫలితాల్లో అగ్నివీర్ వాయు విభాగంలో జిల్లాకు చెందిన ఇద్ద రు యువకులు, ఓ యువతి ఎంపికై ఉద్యోగా లు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఊశన్న, దేవత దంపతుల కుమార్తె శ్రే య చందల్వార్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి–బి గ్రామానికి చెందిన ఆకుల సురేష్ కుమారుడు వినయ్ కుమార్, బజార్‌హత్నూర్ మండలం బోస్రా గ్రామానికి చెందిన సోన్టాకే అశోక్, సుగుణ దంపతుల కుమారుడు మన్మత్ ఉద్యోగాలు సాధించారు. శిక్షకుడు వీ జీఎస్ రాకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పూలే విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సింగరేణి కాల రీస్ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం జీఎం ఎం శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బీసీ లైజన్ అధికారి ఎన్.సత్యనారాయణ, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు.
అగ్నివీర్‌లుగా ఎంపిక
అగ్నివీర్‌లుగా ఎంపిక


