అందరికీ అభయం.. ఓటేసేదెవరికో?
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల తొలి విడత అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే తీవ్రంగా శ్రమించారు. రెండు, మూడో విడత ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలి చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదించాలని సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు మీకు అండగా ఉండి సేవచేస్తామని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ అనేక హామీలు గుప్తిస్తున్నారు. ముఖ్యంగా యువ త మద్దతు చేజారకుండా ఉండేందుకు నామినేషన్ల ప్రారంభం నుంచే మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అయితే ప్రచారానికి వెళ్లిన ప్రతీ అభ్యర్థిని నిరాశ పర్చకుండా మా మద్దతు నీకేనంటూ ఓటర్లు అభయమిస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి ఓటు వేయమని వేడుకుంటున్న వారికి మీరు అంతగా చెప్పాలా.. తప్పకుండా మా ఓట్లన్నీ మీకేనంటూ నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశం సర్పంచ్ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. ఓటరు నాడీ వారికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతీ అభ్యర్థికి మా సపోర్టు నీకేనంటూ చెబుతుండటంతో బ్యాలెట్ పేపర్‌పై ఎవరికి మద్దుతునిస్తారనే సందిగ్ధంగా మారింది. అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తుండగా ఓటరు ఎవరకి పట్టం కడతారన్నది అంతకు చిక్కడం లేదు.
‘అన్నా.. నమస్తేనే. బాపూ.. ఏంజెత్తన్నవ్.. పాణం మంచిగుందా. అక్కా.. బాగున్నారా... అంటూ వరుసలు కలుపుతూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు. ‘ఈ సారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్ననే.. జర మీ అందరి సపోర్ట్ కావాల్నే.. పోయిన సారి వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ తాప జెరంత నాపై దయచూపండే.. మీతో పాటు ఇంటోళ్లవి, దోస్తుల ఓట్లు అందరివీ మనకే పడేలా చూడండే.. అంటూ అభ్యర్థులు చేతులు జోడిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఓటర్లు కూడా అలాగే స్పందిస్తున్నారు.. ‘అరే.. నువ్వు భలే ఉన్నవే.. అంతగా బతిమిలాడల్నా... నీకు కాకపోతే ఇంకోళ్లకే.. నాతో పాటు మా ఇంటోళ్ల ఓట్లన్నీ నీకే.. బేఫికర్‌గా ఉండు. ఈ సారి నువ్వే గెలుస్తున్నవ్ పో.. ’అంటూ ఇంటికి వచ్చే అభ్యర్థులందరికీ ఓటరు ఇస్తున్న అభయమిది. పల్లెపోరులో భాగంగా ప్రతీ ఊరిలో ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలివే. నేడు తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా ఓటరు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే.


