నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్‌టౌన్: టీబీ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్ డాక్టర్ స్నేహ శుక్లా అన్నారు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో గల ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. టీబీ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎక్స్‌రే పనితీరును పరిశీలించారు. మందులు పంపిణీ చేస్తున్నారా, క్షేత్రస్థాయికి వెళ్లి రోగుల పరిస్థితిని తెలుసుకుంటున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌తో పాటు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సేవలు ఎలా అందుతున్నాయి, జిల్లాలో ఎంత మంది క్షయ రోగులు ఉన్నారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తదితర విషయాలను తెలుసుకున్నారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఏసీఎస్‌ఎం కన్సల్టెంట్ సురేశ్ తదితరులున్నారు.


