పట్టు నిలిచేనా..?
పంచాయతీ ఫలితాలు ఆ పార్టీలకు కీలకం మూడు నియోజకవర్గాల్లో తొలివిడత ఎన్నికలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం బలపర్చిన అభ్యర్థుల గెలుపే వారికి ప్రతిష్టాత్మకం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రాజకీయం విభిన్నం.. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలకు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తింపుపై జరిగేవి కాకపోయినప్పటికీ ఈ నేతలకు తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు ప్రతిష్టాత్మకం. ఫలితాలు తారుమారైతే తమ పట్టు జారిందనే విమర్శలతో పాటు పార్టీ పరిస్థితిపై మరో రకంగా కార్యకర్తల్లో చర్చ సాగుతుందనే అభిప్రాయం స్థానిక ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అందుకే పార్టీ పరంగా ఈ ఎన్నికలు జరగకపోయినా వారు మా త్రం తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో ప్రభావం చూపెట్టడం ద్వారా మిగతా రెండు విడతల్లోనూ గట్టి ఫలితాలు సాధించాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూడు నియోజకవర్గాలు.. ఆరు మండలాలు
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నేడు ఆరు మండలాల్లో జరగనున్నాయి. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోరు సాగుతుంది. ఇవన్నీ ఎస్టీ రిజర్వుడ్ పంచాయతీలే. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఖా నాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ఈ విడత కీలకం కానుంది.
బోథ్‌లో..
బోథ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే మలి విడతలో జరిగే మిగతా మండలాల్లో పట్టు సాధించవచ్చనేది ఆయన ప్రయత్నం. రెండు మండలాల్లో 52 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, 12 జీపీలు ఏకగ్రీవాలయ్యా యి. ఇందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సమఉజ్జీ లుగా ఉండగా, బీజేపీ తాము ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఇప్పటివరకు పరిస్థితి ఉంది. ఇక ఎ న్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెలే వెడ్మ బొజ్జుకు అత్యంత కీలకంగా మారింది. ఇటీవలే ఆయన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియామకం అయ్యారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గంలో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గె లుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి వి డత ఎన్నికలు జరిగే రెండు మండలాల్లో 11 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులతో పాటు ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఏకగ్రీవంలో కనిపించింది. బీఆర్‌ఎస్‌కు ఇక్కడ ఏకగ్రీవాల్లో చో టు లభించలేదు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఫలి తాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఆసిఫాబాద్‌లో..
ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తనకున్న గట్టి పట్టును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా ఆమె ముందుకు కదులుతున్నారు. ఈ నియోజ కవర్గంలోని రెండు మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ 10 ఏకగ్రీవాలకు గాను ఏకపక్షంగా బీఆర్‌ఎస్ ముందుంది. కాంగ్రెస్ ఉనికి చాటుకునేంత పరిస్థితి మాత్రమే ఉంది. ఇక ఎన్ని కల ఫలితాలపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.


