పకడ్బందీ ఏర్పాట్లు
936 మందితో బందోబస్తు ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: పంచాయతీ ఎన్నికలకు పోలీ సుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మొదటి విడత ఆరు మండలాల ఎన్నికలకు సంబంధించి బుధవారం ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర ప్రాంతా ల్లో బందోబస్తును పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలివిడతకు 936 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. 38 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెష ల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 599 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 20 ఆయుధాల ను సేఫ్ డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్లస్టర్ రూమ్ మొ బైల్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బందోబస్తులో ముగ్గురు అదన పు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐ లు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలోని 38 గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
ప్రలోభాలకు గురికావొద్దు..
ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. పోలింగ్ కేంద్రం పరి ధిలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపా రు.సోషల్‌మీడియా,ఇతర సామాజిక మాధ్యమా ల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, కించపర్చేలాపోస్టులు పెట్టవద్దని, వీటిపై పోలీసు నిఘా ఉంటుంద ని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారమైనా డయ ల్ 100 ద్వారా అందించాలని సూచించారు. డ బ్బు, మద్యం, బహుమతులు వంటివి పంచే క్ర మంలో పోలీసులకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలి
ఇచ్చోడ: పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రత్యేక కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశా ల ఆవరణలో బందోబస్తుకు కేటాయించిన పోలీ సు సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో రాజు, సిబ్బంది ఉన్నారు.


