● పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● జిల్లాలో 6.2 డిగ్రీల
చలి గుప్పిట్లో..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. వేకువజామున పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి మంటలు కాగుతూ జనం ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సొనాలలో 7.6, భోరజ్‌లో 7.9, తాంసిలో 8, రాంనగర్‌లో 8.2, నేరడిగొండలో 8.6, ఆదిలాబాద్ పట్టణంలో 8.7, బోథ్‌లోని పొచ్చరలో 8.9, బజార్‌హత్నూర్‌లో 8.9, జైనథ్‌లో 9.1, బరంపూర్‌లో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


