గంటల వారీగా పోలింగ్ శాతం
న్యూస్‌రీల్
పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు ప్రశాంతంగా తొలి విడత ఎన్నికలు 77.52 శాతం పోలింగ్ నమోదు రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు విజేతల గెలుపు సంబరాలు
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఇంద్రవెల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
కై లాస్‌నగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లోని 133 పంచాయతీలు 433 వార్డు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు తమ ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. గజగజ వణికిస్తున్న చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నిర్ణీత సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉండగా అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలబడిన ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో ఆయా మండలాల పరిధిలో 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మందకొడిగా మొదలై...ఆపై పుంజుకుని
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఆయా మండలాల పరిధిలో 1,52,626 మంది ఓటర్లు ఉండగా, 1,05,468 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 75,139 మంది పురుష ఓటర్లకు గానూ 52,211 మంది, 77,476 మంది మహిళా ఓటర్లకు గానూ 53,255 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఆరుగురికి గానూ ఇద్దరు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ మందకొడిగా సాగింది. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆతర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ శాతం క్రమేణ పుంజుకుంది. తొలిసారిగా ఓటుహక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబ సభ్యులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. 9 గంటల తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల బారులు కన్పించాయి. దీంతో పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటిగంట వరకు 69.10 శాతం నమోదైంది. అప్పటికే పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతీ రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళిని ప్రకటించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరికొండ మండలం సుంకిడి, ఇచ్చోడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు..
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు పోలింగ్ శాతం
ఇచ్చోడ 33,166 26,670 13,233 13,437 00 80.41
గాదిగూడ 13,027 10,725 5,370 5,355 00 82.33
ఇంద్రవెల్లి 29,648 22,792 11,302 11,490 00 76.88
నార్నూర్ 19,359 15,643 7,962 7,681 00 80.8
సిరికొండ 9,639 8,390 4,184 4,206 00 87.04
ఉట్నూర్ 47,787 34,092 17,056 17,033 03 71.34
మండలం 9 గంటలకు 11 గంటలకు ఒంటిగంటకు పోలింగ్ ముగిసిన తర్వాత
ఇచ్చోడ 9.70 35.61 70.38 80.41
గాదిగూడ 14.29 53.77 78.18 82.33
ఇంద్రవెల్లి 6.17 33.14 57.60 76.88
నార్నూర్ 11.99 45.11 78.22 80.8
సిరికొండ 20.87 60.21 85.12 87.4
ఉట్నూర్ 10.56 38.59 65.95 71.34
రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు..
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 25 ఓట్లను ఒక బెండల్‌గా వేరు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో విజేతలను ప్రకటించారు. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉండగా ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది.
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం
గంటల వారీగా పోలింగ్ శాతం


