మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రథమ భాష, 18న ద్వితీయ భాష, 23న ఇంగ్లిష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్, 7న బయోసైన్స్, 13న సాంఘిక శాస్త్రం, 15న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని డీఈవో వివరించారు.
32 ఏకగ్రీవ స్థానాలు బీఆర్‌ఎస్‌వే
బోథ్: బోథ్ నియోజకవర్గంలో 47 పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో 32 మంది బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే ఉన్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో 32 పంచాయతీలను ఏకగ్రీవంగా కై వసం చేసుకున్న సర్పంచులను అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్‌ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతుందన్నారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
కై లాస్‌నగర్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీ లించేందుకు 21 పోలింగ్ కేంద్రాల్లోని 41 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేశారు. కలెక్టర్ రాజర్షిషా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్ర ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు


