వేతనంలో కోత విధించొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ టీచర్ల వేతనంలో కోత విధించవద్దని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు అన్నారు. గురువారం ఐసీడీఎస్ పీడీ మిల్కాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల అంగన్‌వాడీల రాష్ట్ర మహాసభలకు వెళ్లిన వారి ఒకరోజు వేతనంలో నుంచి కోత విధించినట్లు తెలిపారు. టీచర్లు, ఆయాలు సెలవు పెట్టినప్పటికీ ఒకరోజు వేతనాన్ని తగ్గించారని పేర్కొన్నారు. కోత విధించిన ఒకరోజు వేతనాన్ని తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, తదితరులు ఉన్నారు.


