ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్‌లు, సిబ్బంది నియామకం, భద్రతాచర్యలు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ తదితర అంశాలపై మండలాలవారీగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో 24గంట ల పాటు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా ని యమావళి ఉల్లంఘనలు గమనించినా వెంటనే చ ర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారాలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. 14 ఎఫ్ ఎస్‌టీలు, మూడు ఎస్‌ఎస్‌టీలు నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీవో స్రవంతి, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తనిఖీ వాహనాలు ప్రారంభం
కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద కలెక్టర్ రాజర్షి షా ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ తనిఖీ వాహనాలను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు నిత్యం గ్రామాల్లో తిరుగు తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా పరిశీ లిస్తాయని తెలిపారు. మోడల్ కోడ్‌ను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.50వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తున్నవారు తప్పనిసరిగా వాటి ఆధారాలు చూపాలని సూచించారు.
పార్టీల ప్రతినిధులతో సమావేశం
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మా ట్లాడారు. ప్రచారానికి అవసరమైన అనుమతుల మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బు, మద్యం పంపిణీ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా వ్యవస్థ, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో..
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎ స్‌టీ బృందాలతో కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు. ప్రచార పత్రాల్లో ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టనున్న గ్రీవె న్స్ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరి ష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


