ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచార వ్యవస్థ సాధ్యం గాని ప్రదేశాలు, షాడో జోన్‌లలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వా రా వీహెచ్‌ఎఫ్ సెట్‌లను వినియోగించాలని తెలిపా రు. అత్యధిక జనాభా కలిగిన పంచాయతీల్లో బైక్ పెట్రోలింగ్ ద్వారా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేశామని ఎలాంటి సమాచారమున్నా వారికి తెలుపాలని సూచించారు. అన్ని గ్రామాలను కలిసి ఉండేలా రూట్ మొబైల్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను తని ఖీ చేస్తూ ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీలు కాజల్‌సింగ్, సురేందర్‌రావు, మౌనిక, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, కమ్యూనికేషన్, డీసీఆర్‌బీ, ఎన్‌ఐబీ సిబ్బంది పాల్గొన్నారు.


