ఏకగ్రీవం దిశగా అడుగులు
ఇంద్రవెల్లి: మండలంలోని తేజాపూర్ సర్పంచ్‌గా కోవా రాజేశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు గ్రామస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం మండలంలోని మెండపల్లి, వాల్గోండ గ్రా మాల ప్రజలు సమావేశమై సర్పంచ్, ఉప సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించారు. మెండపల్లి సర్పంచ్‌గా కొడప శ్రీరాం, ఉప సర్పంచ్‌గా ముండే మోహన్, వాల్గోండ సర్పంచ్‌గా కినక సునీత–జుగాదిరావ్, ఉప సర్పంచ్ జుగ్నాక నిర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో వీరిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదనంగా తన తరఫున రూ.25లక్షలతో అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏఎంసీ చైర్మన్ ముఖ డే ఉత్తం, నాయకులు కినక లచ్చుపటేల్, మెస్రం సోమేశ్వర్, కొడప జాకు, ఉర్వేత నాగోరావ్, కనక పాండురంగ్, తుకారాం, అర్జున్ తదితరులున్నారు.
సిరికొండలో 19కి నాలుగు..
సిరికొండ: మండలంలోని గిరిజన గ్రామపంచాయతీలైన రాయిగూడ సర్పంచ్‌గా పెందుర్ లక్ష్మణ్, రి మ్మ సర్పంచ్‌గా పెందుర్ జంగుబాయి, కుంటగూడ సర్పంచ్‌గా కుంరం మీరాబాయి, కన్నాపూర్ సర్పంచ్‌గా సిడాం బాలదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటా మని ఆయా గ్రామాల ప్రజలు ప్రకటించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించుకుని తీర్మానాలు చేసుకున్నారు. మండలంలో 19 పంచాయతీలుండగా నాలుగు దాదాపు ఏకగ్రీవమైనట్లే తెలుస్తోంది. కాగా, మండలంలోని మరిన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని సమాచారం.
ఏకగ్రీవం దిశగా అడుగులు
ఏకగ్రీవం దిశగా అడుగులు
ఏకగ్రీవం దిశగా అడుగులు


