● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Nov 27 2025 6:08 AM | Updated on Nov 27 2025 6:08 AM

● నేట

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కై లాస్‌నగర్‌: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడు తొలివిడత నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అలాగే నామినేషన్ల స్వీకరణ కూడా నేటి నుంచి షురూ కానుంది. ఈ నెల 29న సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలు, 1,390 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. 4నుంచి 5 గ్రామ పంచాయతీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ప్రతీ క్లస్టర్‌కు గెజిటెడ్‌స్థాయి హోదా కలిగిన పీజీ హెచ్‌ఎంలు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపకులు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలను స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. వారికి సహాయకులుగా స్కూల్‌ అసిస్టెంట్లను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా కేటాయించారు. వీరు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తారు.

ముహూర్తంపై దృష్టి

ప్రస్తుతం బుధవారం నుంచి మూఢం ప్రారంభమైనట్లుగా వేదపండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా కొత్తగా ఎలాంటి పనులు మొదలుపెట్టరు. కానీ నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు ఉన్నందున బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఆ రోజుల్లో మంచి ముహూర్తాలపై దృష్టి సారిస్తున్నారు. తొలి విడత ఎన్నికలు ఏజెన్సీ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహ అభ్యర్థులు వేదపండితులను ఆశ్రయిస్తున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తదనుగుణంగా నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.

ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఇటీవల సడలించింది. ఇది వరకు సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకునే వారు ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన అమలులో ఉండేది. ఇటీవల దాన్ని సడలించడంతో గతంలో అవకాశం లేక నిరాశ చెందిన ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు ప్రస్తుతం పోటీకి సై అంటున్నారు.

కోవ రాజేశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్న గ్రామస్తులు

ఎన్నికలు నిర్వహించే మండలాలు 6

ఇంద్రవెల్లి: తొలివిడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని తేజాపూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఏకగ్రీవమైంది. మాజీ ఎంపీటీసీ కోవ రాజేశ్వర్‌ను ఎన్నుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గ్రామంలో సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామస్తులు మడావి చిత్రు, మడావి దశరథ్‌, సోము, దేవ్‌రావ్‌, నాగోరావ్‌, దత్తు తదితరులున్నారు.

తొలి విడతలో..

గ్రామ పంచాయతీలు 16

తేజాపూర్‌ సర్పంచ్‌ ఏకగ్రీవం

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని బుధవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని 166 పంచాయతీలకు తొలి విడత నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పోలింగ్‌ సామగ్రి ఇప్పటికే సంబంధిత మండల కేంద్రాలకు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌, ఆర్డీవో స్రవంతి, డీఎల్పీవో ఫణిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి1
1/4

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి2
2/4

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి3
3/4

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి4
4/4

● నేటి నుంచి తొలివిడత ‘పంచాయతీ’ ● ఏర్పాట్లు పూర్తి చేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement