రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
ఆదిలాబాద్‌టౌన్: రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఎస్సీ కాలనీ, శాంతినగర్‌లో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హె చ్చరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రధాన కూ డళ్లు, వీధులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటం పోలీసుల బాఽ ద్యత అని అన్నారు. రాత్రి వేళల్లో ఇష్టానుసారం బ యట తిరగవద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునిల్‌కుమార్, కె.నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
లక్ష్యసాధనపై దృష్టి సారించాలి
ఇచ్చోడ: విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు. విద్యార్థినులు వేధింపులకు గురైతే షీటీంను సంప్రదించాలని సూచించారు. ఇందులో సీఐ రాజు, ఇన్‌చార్జి ఎస్సై అంజమ్మ, పాఠశాల నిర్వాహకులు శ్యాంరెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మావల పోలీస్‌స్టేషన్‌లో అదనపు గదులు ప్రారంభం
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన అదనపు గదులను ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ప్రారంభించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ఎస్సైల కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ స్వామి, ఎస్సైలు మధు, కృష్ణ, యూనస్ ఖాన్, సిబ్బంది ఉన్నారు.


