జిల్లా కేంద్రంలో పర్యటించిన సివిల్ సర్వీసెస్ అధికారు
కై లాస్‌నగర్: ఆలిండియా సివిల్ సర్వీసెస్ అధికా రుల బృందం బుధవారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పర్యటించింది. తొలుత మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వారికి కమిషనర్ సీవీఎన్. రాజు స్వాగతం పలికారు. మున్సిపల్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్‌లో గల ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, వాటి సద్వినియోగం తీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మున్సిపల్ పాత కార్యాలయ భవనంలో ఎస్‌ఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాప్‌కిన్ తయారీ కేంద్రంతో పాటు స్టీల్‌బ్యాంక్‌ను పరిశీలించారు. వాటి నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం పట్టణానికి తాగునీటిని అందిస్తున్న ఫిల్టర్‌బెడ్, డంపింగ్‌యార్డ్‌ను పరిశీలించారు. వారి వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్ బైరి శంకర్, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు, మెప్మా సీవో గంగన్న తదితరులున్నారు.


