ఆపరేషన్లకు ముందుకురావాలి
ఆదిలాబాద్‌టౌన్: వేసెక్టమీ ఆపరేషన్లకు పురుషులు ముందుకురావాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథో డ్ సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో వేసెక్టమీ పక్షోత్సవాల నిర్వహణపై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశంని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పురుషులకు కోత, కుట్టు లేకుండా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి ముప్పు ఉండదని, ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం రాదని, అపోహలు వీడి ఆపరేషన్లు చేసుకునేందుకు పురుషులు ముందుకు రావాలని సూచించా రు. అన్ని పీహెచ్‌సీల్లో కనీసం ఐదు ఆపరేషన్లు చేసే లా శ్రద్ధ వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి వచ్చే నెల 4వరకు వేసెక్టమీ షక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమా వేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో సాధన, ప్రోగ్రాం అధికారి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.


