ఎవరిని నిలబెడుదాం..!
కైలాస్‌నగర్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. గురువారం నోటిఫికేషన్ జారీ కా గా, తొలివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. పార్టీ ఎన్నికలు కానప్పటికీ సర్పంచులు భవిష్యత్ రాజకీయాల్లో పా ర్టీ బలోపేతంలో కీలకం కానున్నారు. దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపాలని భావిస్తున్నాయి. అలాగే, ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తే ఆర్థిక వెసులుబాటు కలగనుండటంతో పాటు విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆశావహులు ముఖ్య నాయకుల మద్దతు కోసం ప్ర యత్నిస్తున్నారు. ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండటంతో పోటీలో ఎవరిని నిలిపితే బాగుంటుంది.. గెలిచే అవకాశాలు ఎవరికున్నాయనే దిశగా పా ర్టీలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. ఇందు కు గ్రామాలు, సామాజికవర్గాల వారీగా పార్టీ క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలబలాలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డాయి. దీంతోపల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అభ్యర్థుల కోసం అన్వేషణ
త్వరలోనే పరిషత్ ఎన్నికలూ జరగనుండటంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పా ర్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను సర్పంచ్‌గా బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. జనరల్ స్థానాల్లో ఆర్థిక, అంగబలమున్న వారిపై దృష్టి సారించాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో సామాజికవర్గాల వారీగా గ్రామస్తులతో నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పా ర్టీల్లోని గెలిచే అవకాశమున్న వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువ నాయకులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల్లో వారికున్న పలు కుబడి, ఆర్థిక స్థిరత్వం కలిగిన అంశాలను బేరీజు వేస్తున్నారు. దీంతో ఆయ పార్టీల ముఖ్య నేతలు, ఎ మ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను ప్రసన్నం చే సుకునే పనిలో పడ్డారు. ప్రధానంగా అధికార పార్టీ లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఆయా పార్టీల క్యాడర్‌లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
పెద్ద ఎత్తున నిధులు రానుండడంతో..
సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు రెండేళ్లవుతోంది. పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు అందాల్సిన ఎస్‌ఎఫ్ సీ, ఎఫ్‌ఎఫీసీ నిధులు పూర్తిగా నిలిచాయి. కొత్త పా లకవర్గాలు కొలువుదీరాక పంచాయతీలకు పెద్ద ఎ త్తున నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఈసారి సర్పంచ్‌గా బరిలో నిలిచేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతుండగా ఇందులో యువతే ఎక్కువగా ఉండడం గమనార్హం. రెండేళ్లుగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. నామినేషన్ ఎప్పుడు వేద్దా మా.. అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. ఆశావహు ల సంఖ్య ఎక్కువగా ఉండగా అభ్యర్థుల ఎంపిక పా ర్టీలకు తలనొప్పిగా మారనుంది. ఒకరిని ఎంపిక చే స్తే మరొకరు రెబల్‌గా బరిలో నిలిచే అవకాశాలు న్నాయి. దీంతో గ్రామంలోని ముఖ్య నాయకులతో సమావేశమై మెజార్టీ అభిప్రాయాలకు తగినట్లు అభ్యర్థిని నిలిపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఏకగ్రీవం దిశగా యత్నాలు
సర్పంచ్ ఎన్నికల బరిలో నిలువాలనుకునే అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ పడుతుండగా కొన్నిచోట్ల ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. వీడీసీలు బలంగా, ఐక్యంగా ఉన్న చోట తమకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్‌గా ఎ న్నుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ గ్రామస్తులు ఒకే అభ్యర్థిని ఎంపిక చేసుకోగా దాదాపు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. ఇదే బాటలో మరిన్ని గ్రామాల్లోనూ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ద్వారా గ్రామాభివృద్ధికి కలిసి వస్తుందని, తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని పలు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.


