
ఇంద్రవెల్లి పీజీహెచ్‌ఎం సరెండర్
● నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కొరడా
ఆదిలాబాద్‌టౌన్: ఇంద్రవెల్లి పీజీ హెచ్‌ఎం రాంమోహన్‌పై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. పాఠశాలలోని పీఎంశ్రీ నిధులకు సంబంధించి దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు ప్రధానోపాధ్యాయుడు పీఎంశ్రీ నిధులను దుర్వినియోగం చేశాడని, అలాగే పాఠశాలలో వాతావరణానికి భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఆయనను వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డికి సరెండర్ చేశారు. ఇదిలా ఉండగా ఇంద్రవెల్లి పాఠశాలలో పోక్సో కేసులో ఇటీవల సస్పెండ్ అయిన నాందేవ్ అనే ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు బోథ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు కేటాయించారు.