
మెరుగైన వైద్య సేవలందించాలి
ఉట్నూర్‌రూరల్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. మాతా శిశు మరణాలు, ఇతర అంశాలపై వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో జిల్లా అదనపు వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసి సమయానుసారం వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలన్నారు. అనంతరం మండలంలోని శ్యాంపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీలను సందర్శించారు. వారి వెంట అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, క్షయ నివారణ అధికారి సుమలత, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తోషం సబ్‌సెంటర్ తనిఖీ
గుడిహత్నూర్: మండలంలోని తోషం సబ్‌సెంటర్‌ను డీఎంహెచ్‌వో శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణులకు అవసరమైన సలహాలు అందిస్తూ పీహెచ్‌సీలో ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. వారి వెంట హెల్త్ అసిస్టంట్ ఎజాజ్, ఏఎన్‌ఎంలు సునీత, తుర్పాబాయి, ఆశవర్కర్ రేణుక ఉన్నారు.