
పొగాకుతో ఆరోగ్యంపై ప్రభావం
ఆదిలాబాద్‌టౌన్: పొగాకు సేవించడంతో ఆరో గ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బాలక్‌మందిర్, ప్రభుత్వ నం.2 పాఠశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొగాకు, మత్తుపదార్థాలతో క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడతా రని తెలిపారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నం.2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.