
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఇంద్రవెల్లి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఉట్నూర్ సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. పలు అంశాలపై వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో రౌడీలు, సస్పెక్ట్ రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతీ గ్రామంలో విలేజ్ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించాలన్నారు. అలాగే జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, కానిస్టేబు ళ్లు ఉన్నారు.
ఒత్తిడికి గురికావద్దు
ఆదిలాబాద్‌టౌన్: ఒత్తిడికి గురైతే మానసిక ఆరో గ్యంతో బాధపడతారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని రిమ్స్ డైరెక్టర్ చాంబర్‌లో తెలంగాణ జూనియర్ డాక్టర్లు మానసిక ఆరోగ్య హెల్ప్‌డెస్క్, ఫీర్ సపోర్ట్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు ఓంప్రకాశ్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు