
సైన్స్‌పై ఆసక్తి పెంచడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచడమే లక్ష్యమని జిల్లా సైన్స్ అధికారి ఆరే భాస్కర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ‘మానవజాతి ప్రయోజనం కో సం శాస్త్ర సాంకేతికత’ అంశంపై జిల్లా స్థాయి సైన్స్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాల ల విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు శాస్త్ర స్ఫూర్తి ని ప్రతిబింబించాయి. బంగారిగూడ మోడల్ స్కూ ల్ ప్రథమ, బరంపూర్ జెడ్పీహెచ్‌ఎస్ ద్వితీయ, ఇంద్రవెల్లి జెడ్పీహెచ్‌ఎస్ తృతీయ స్థానాల్లో నిలువగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్ర థమ స్థానంలో నిలిచిన బంగారిగూడ విద్యార్థులు ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. హెచ్‌ఎంలు లచ్చిరాం, డైట్ కళాశాల ప ర్యవేక్షకులు మమత, శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్, హెచ్‌ఎం లక్ష్మణ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.