
120 ఏళ్ల ‘నస్పూర్ గడి’
నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని విలేజ్ నస్పూర్‌లో 120 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడి నాటి పాలనకు సాక్ష్య ంగా నిలుస్తోంది. 1905లో నిజాం హయాంలో నస్పూర్‌కు చెందిన జీవీ వంశీయులు ఇనుము, కాంక్రీట్ వాడకుండా కేవలం డంగుసున్నంతో రెండంతస్తుల భవనం నిర్మించారు. చుట్టూ నాలుగెకరాల ప్రహరీ సైతం డంగుసున్నంతోనే నిర్మించడం ప్రత్యేకత. ఈ గడి కేంద్రంగా నిజాం సంస్థానాధీశులు లక్సెట్టిపేట, ఇందారం, జన్నారం, తపాలాపూర్, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ, చంద్రపూర్, మధ్యప్రదేశ్‌లోని బస్తర్ వరకు ఇక్కడి నుంచే పాలన కొనసాగించే వారు. స్వాతంత్య్రానంతరం ఈ కట్టడం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. కొద్ది నెలల క్రితం హెరిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు.