
కొండచిలువ హల్‌చల్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా సమీపంలో శనివారం అర్ధరాత్రి 9 అడుగుల భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహాదారి డివైడర్ మధ్యలో కనిపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించే ప్రయత్నం చేశారు. స్నేక్ క్యాచర్ అనిల్ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
దస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గ్రామానికి చెందిన కొంపెల్లి నర్సయ్య(45) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం పెద్దకుమార్తెకు వివాహం చేయడంతో కుటుంబంలో తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కొండచిలువ హల్‌చల్