
అంబులెన్స్‌కు దారి కష్టాలు
బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్‌కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్‌గౌడ్‌లు శనివారం రాత్రి వెంకటి మృతదేహాంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్‌ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్‌నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
వెంకటి మృతదేహానికి వవెళ్లిన అంబులెన్స్‌కు దారికష్టాలు