
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారానికి తమ సంఘం ముందుండి పోరాటం చేస్తుందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు పుల్గం దామోదర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పక్షం రోజుల్లో నూతన హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నర్సింహాస్వామి, డీసీఈబీ కార్యదర్శి కందుల గజేందర్, సంఘ బాధ్యులు గోవర్ధన్, భాస్కర్, రవీందర్, శశికళ, కిషన్, లక్ష్మి, శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు.