
గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా సాయి చైతన్య
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా సాయి చైతన్య ఎన్నికయ్యారు. జిల్లా నూతన పాలకవర్గ ఎన్నిక భుక్తాపూర్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి బి.మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్ష పదవీ కోసం సాయి చైతన్య, మేకల రవికాంత్, ఉపాధ్యక్ష పదవి కోసం కేమ లక్ష్మణ్, కెంద రాకేశ్ పోటీపడ్డారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికలో సదరు అభ్యర్థులకు ఆరేసి ఓట్లు చొప్పున సమానంగా వచ్చాయి. లాటరీ విధానంలో సాయి చైతన్య, కేంద రాకేశ్‌ను అదృష్టం వరించింది. ఇరువురు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికై నట్లుగా డీసీవో ప్రకటించారు. అనంతరం మద్దతుదారులు, యాదవ కులస్తులు, డైరెక్టర్లు వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాగా సంఘం డైరెక్టర్లుగా మేకల రవికాంత్, కేమ లక్ష్మణ్, వై.కిష్టయ్య, జి.వేణుగోపాల్, అసుర రమేశ్, పాత దేవన్న, గొర్ల రాజన్న, కేమ ఊషన్న, జి.వెంకటేశ్, బి.రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.